నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పాల్తీతండాకు చెందిన రఘురాంనాయక్ వృత్తి సీఐఎస్ఎఫ్లో పోలీసు... ఉత్తర ప్రదేశ్‌లో ఉద్యోగం నిర్వర్తిస్తున్నాడు. కుటుంబమంతా సొంతూళ్లోనే ఉంటోంది. కాగా కొద్ది రోజులుగా తన తల్లి డేగవత్ఘోరీ అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే ఆదివారం ఆమె మరణించింది. ఆ వార్త విన్న రఘురాం తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన ఉన్నతాధికారులకు సమాచారం అందించి అనుమతి పొందాడు.
తల్లి కడసారిచూపుకై తల్లడిల్లిన పోలీస్ - పోలీసు అధికారి
నవమాసాలు మోసి.. పెంచి ప్రయోజకుడిని చేసిన కన్నతల్లిని.. కడసారి చూసుకోలేకపోవడం తీవ్ర బాధాకరం. అందులోనూ వృత్తే దైవంగా ప్రజల రక్షణే ధ్యేయంగా భావించిన ఓ పోలీసు అధికారికి ఆ పరిస్థితి రావడం వర్ణనాతీతం. కాగా లాక్డౌన్ కారణంగా ఇలాంటి పరిస్థితి నల్గొండ జిల్లా వాసియైన ఓ యువ పోలీస్‌కు ఎదురైంది.
తల్లి కడసారిచూపుకై తల్లడిల్లిన పోలీస్
కానీ ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల కారణంగా దుఃఖాన్ని దిగమింగుకుని తాను రాలేక.. కన్నతల్లిని చివరిచూపు చూసుకోలేక తల్లడిల్లిపోయాడు. అన్నదుమ్ముల సాయంతో తన తల్లిని చివరిసారిగా చూసేందుకు అంత్యక్రియల ప్రక్రియను వీడియో కాల్ ద్వారా చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అనంతరం తాను తన కర్తవ్యం నిమిత్తం విధులకు హాజరై 'సలాం పోలీస్' అనిపించుకున్నారు.
ఇవీ చూడండి:ఆ రాష్ట్రంలోకీ ఎంటరైన కరోనా- నేడు తొలి కేసు నమోదు