తెలంగాణ

telangana

ETV Bharat / state

Musical stone aitipamula Nalgonda : ఆ బండరాయిని తాకితే... మధురమైన సంగీతం..! - తెలంగాణ వార్తలు

Musical stone aitipamula Nalgonda : గుడిలో గంటను కొడితే శ్రావ్యమైన శబ్ధాలు ప్రతిధ్వనిస్తాయి. అవి మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. వినసొంపైన శబ్ధాలు మనలోని ఆధ్యాత్మికతను తట్టిలేపుతాయి. అయితే అటువంటి శ్రావ్యమైన శబ్ధాలు ఓ బండరాయి నుంచి వస్తున్నాయి. అది కూడా చెరువు పక్కన ఉన్న ఆ రాయిని తాకితే చాలు మధురమైన సంగీతాన్ని పలికిస్తోంది.

Musical stone aitipamula Nalgonda, stone music
ఆ బండరాయిని తాకితే... మధురమైన సంగీతం

By

Published : Dec 25, 2021, 10:27 AM IST

ఆ బండరాయిని తాకితే... మధురమైన సంగీతం

Musical stone aitipamula Nalgonda : నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామం సమీపంలోని....... ఓ రాయి నుంచి సంగీతం శబ్ధాలు వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ఓ పెద్ద బండరాయిని తాకితే చాలు మధురమైన సంగీతం వినిపిస్తోంది.

ఎలా తెలిసింది?

ఐటిపాములలోని బ్రహ్మదేవర చెరువు సమీపంలో పెద్దఎత్తున బండరాళ్లు ఉన్నాయి. అందులో ఓ రాయిని కొడితే.. గంట కొట్టినట్లుగా శబ్దం వస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతానికి మేకలు, ఆవులు కాసేందుకు వెళ్లిన కాపర్లు చూసి.. ఆ రాయిని కొడుతూ అక్కడే పాటలు పాడుతూ వినోదాన్ని పొందేవారు.

ప్రస్తుతం ఆ విషయం గురించి తెలియడంతో ఆ రాయిని చూసేందుకు స్థానికులు వస్తున్నారు. ఆ రాయి నుంచి సంగీతం ఎలా వస్తుందో అధికారులు తెలపాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:దేశంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details