తెలంగాణ

telangana

ETV Bharat / state

Husband Complaint To HRC On Wife: భార్య నుంచి ప్రాణహాని ఉంది.. హెచ్​ఆర్సీకి ఓ భర్త మొర - భార్య నుంచి ప్రాణ హాని ఉందని హెచ్​ఆర్సీకి భర్త ఫిర్యాదు

Husband Complaint To HRC On Wife : తాళికట్టిన భార్య నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించమంటూ ఓ వ్యక్తి హెచ్​ఆర్సీని ఆశ్రయించాడు. నల్గొండ జిల్లా బత్తాయిపాలెం గ్రామానికి చెందిన నిమ్మల కేటేశు.. తన భర్య నుంచి ప్రాణహాని ఉందని.. ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Wife Victim
Wife Victim

By

Published : Feb 22, 2022, 4:19 PM IST

Husband Complaint To HRC On Wife : పెళ్లై నాలుగు నెలలు అయింది. వైవాహిక జీవితం సజావుగా సాగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. వారి జీవితాల్లోకి మూడో వ్యక్తి ప్రవేశం.. వారి కాపురాన్ని విచ్ఛిన్నం చేసింది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందన్న విషయం తెలియడంతో ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. సజావుగా సాగిపోతున్న వారి జీవితాలు వివాదాలకు నిలయంగా మారాయి. ఈ క్రమంలో భార్య నుంచి ప్రాణ హాని ఉందని.. తనకు రక్షణ కల్పిచమని భర్త.. మానవహక్కుల కమిషన్​ తలుపు తట్టాడు.

నల్గొండ జిల్లా బత్తాయిపాలెం గ్రామానికి చెందిన నిమ్మల కోటేశుకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు వారి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే కొన్ని రోజులుగా తన భార్య వేరే వ్యక్తితో మాట్లాడడం గమనించిన కోటేశ్​.. ఆమెను నిలదీశాడు. వారి వ్యవహారంపై ఆరా తీయగా... తనతో పెళ్లికి ముందు నుంచే తన భార్యకు హృతిక్​ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదు.

విషయం బయటపడడంతో అప్పటి నుంచి తనభార్య తన ప్రియుడితో కలిసి తనను హత్యచేసేందుకు ప్రయత్నిస్తుందని కోటేశ్​ ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై మిర్యాలగూడ వన్​టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారు పట్టించుకోలేదని.. అందుకే హెచ్​ఆర్సీని ఆశ్రయించినట్లు తెలిపాడు.

గతేడాది డిసెంబర్​లో నాకు వివాహమైంది. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు నా భార్య మంచిగానే ఉన్నట్లు నటించింది. తర్వాత నన్ను దూరం పెట్టడం, అసహ్యంగా చూడడం మొదలుపెట్టింది. నాకు అనుమానమొచ్చి తన సెల్​ఫోన్​ లాక్కుని చెక్​ చేశాను. ఆమె వేరే వ్యక్తితో చేసిన చాటింగ్​, కాల్​ రికార్డింగ్​లు ఉన్నాయి. ఆమె నన్ను చంపాలని కూడా ప్రయత్నించింది. ఈ పరిస్థితిలో తనతో ఉంటే నన్ను హత్యచేస్తుంది. తన నుంచి నాకు ప్రాణ హాని ఉండడండో మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాను. -కోటేశు, భార్య బాధితుడు

నాలుగు నెలల క్రితం వారికి వివాహమైంది. అతని భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో విచారించాం. కానీ ఆమెతీరులో మార్పురాలేదు. మీరేమి చేసుకుంటారో చేసుకోండని చెప్పారు. ఈ విషయమై మిర్యాలగూడలోని వన్​టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. పోలీసులు మా ఫిర్యాదు స్వీకరించలేదు. అందువల్ల మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాము. హెచ్​ఆర్సీవారు మా ఫిర్యాదు స్వీకరించి బాధితుడికి న్యాయం చేయాలని కోరుతున్నాము. సురేశ్​, గ్రామస్థుడు

భార్య నుంచి ప్రాణహాని ఉందని హెచ్​ఆర్సీని ఆశ్రయించిన భర్త..

ఇదీ చూడండి :సెల్​ టవర్ ఎక్కిన వివాహిత.. చివరికి..!

ABOUT THE AUTHOR

...view details