నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. బండతిమ్మాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని పాటిమీది గూడెం గ్రామానికి చెందిన బొదాసు క్రిష్ణయ్య, బొదాసు వెంకటయ్య అన్నదమ్ములు. గత కొంతకాలంగా వారి మధ్య భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
తమ్ముడిని చంపిన అన్న.. భూ వివాదాలే కారణమా?
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. భూవివాదం కారణంగా తమ్మునిపై అన్న రాళ్లు, కర్రలతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతి చెందారు.
తమ్మున్ని చంపిన అన్న..భూ వివాదాలే కారణం
ఇదే క్రమంలో అన్న బొదాసు కృష్ణయ్య అతని కుమారుడితో కలిసి... తమ్ముడు బొదాసు వెంకటయ్యపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంకటయ్యను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతి చెందారు.
ఇదీ చదవండి:పట్టపగలే చోరీ: ఆస్పత్రికి వెళ్లి వచ్చేలోపే దోచేశారు!