42 రోజులుగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నా ప్రభుత్వ తీరులో మార్పురావడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. నల్గొండ పట్టణంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. డిపో నుంచి క్లాక్‌టవర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదించారు. ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నల్గొండలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన - నల్గొండలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 42వ రోజు కొనసాగింది. నల్గొండ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు డిపో నుంచి క్లాక్‌టవర్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
నల్గొండలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
ఇదీ చూడండి: మెట్పల్లిలో ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు