తెలంగాణ

telangana

ETV Bharat / state

'దమ్ముంటే తెరాస నేతలు బహిరంగ చర్చకు రావాలి' - nalgonda latest news

నల్గొండ జిల్లా హాలియా పురపాలక కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిరసనలో భాగంగా హాలియా బస్టాండ్ నుంచి పురపాలక కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. పెండింగ్​లో ఉన్న మున్సిపల్ నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ.. పురపాలక కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

A Congress-led dharna was held in front of the Nalgonda district Haliya municipal office.
'తెరాస పార్టీకి దమ్ముంటే.. బహిరంగ చర్చకు రావాలి'

By

Published : Jan 27, 2021, 1:05 PM IST

తెరాస ప్రభుత్వం నిధుల మంజూరులో పక్షపాత ధోరణి వ్యవరిస్తోందని.. నల్గొండ జిల్లా హాలియా పురపాలక కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. నిరసనలో భాగంగా హాలియా బస్టాండ్ నుంచి పురపాలక కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఏడాది కాలంగా పెండింగ్​లో ఉన్న మున్సిపల్ నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ.. కాంగ్రెస్ కౌన్సిలర్​లు పురపాలక కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

సాగర్ అభివృద్ధిపై..

సాగర్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప.. ఏడేళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. తెరాస పార్టీకి దమ్ము ఉంటే నాగార్జున సాగర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు సవాలు విసిరారు.

ఇదీ చదవండి:రాజన్న ఆలయంలో ముస్లిం మహిళ కోడె మొక్కులు

ABOUT THE AUTHOR

...view details