తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలిచ్చి పెంచిన తల్లే యాసిడ్ తాగించి చంపేసింది! - MOTHER MURDERED HER SON

భర్త వదిలేశాడు. తన రెండేళ్ల కొడుకుతో తల్లిగారింటికి వచ్చేసింది. అప్పటి నుంచి భర్తను కాపురానికి తీసుకెళ్లమని కోరుతోంది. మూడేళ్లు గడిచినా భర్త ఇంటికి తీసుకెళ్లకపోవడం వల్ల సొంత కొడుకుకు యాసిడ్ తాగించి చంపేసింది ఓ తల్లి.

పాలిచ్చి పెంచిన తల్లే యాసిడ్ తాగించి చంపేసింది

By

Published : Oct 26, 2019, 11:23 AM IST

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఐదేళ్ల తన కుమారుడిని చంపేసిందో తల్లి. శివరాణిని భర్త వదిలేయడం వల్ల మూడేళ్లుగా తల్లి ఇంటి వద్దే ఉంటోంది. భర్తని కాపురానికి తీసుకెళ్లమని ఎంతగా కోరినా అతను స్పందించ లేదు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు. కొడుకు జశ్వంత్​ రెడ్డికి యాసిడ్ తాగించి చంపేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details