తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎట్టకేలకు 50 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు - మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్

మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమ్మెల్యే భాస్కరరావు చొరవతో కరోనా పేషెంట్లకు 50 ఆక్సిజన్ సిలిండర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవల స్థానికంగా ఓ కరోనా రోగి ఆక్సిజన్​ అందక మృతి చెందిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా స్పందించి ఆక్సిజన్​ సౌకర్యాన్ని కల్పించారు.

50 oxygen cylinders set up in Miryalaguda Regional Hospital
ఎట్టకేలకు 50 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు

By

Published : Jul 29, 2020, 5:45 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమ్మెల్యే భాస్కరరావు చొరవతో అధికారులు 50 ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ కొవిడ్ వార్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్​డీఓ, డీఎస్పీ మున్సిపల్ కమిషనర్​లు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన పేద, మధ్య తరగతి ప్రజలు భయపడకుండా స్థానికంగా చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ ప్రజలను కోరారు.

ఏరియా ఆస్పత్రిలో కరోనా టెస్టులు కొనసాగుతుండగా, పాజిటివ్ వచ్చిన బాధితులకు సరైన వైద్యం అందక ఇటీవల మరణించిన ఘటనలు సైతం ఉన్నాయి. స్థానికంగా 100 పడకల ఆస్పత్రి ఉన్నా ఆక్సిజన్ సిలిండర్లు కొరత ఉండటం వల్ల కరోనా బాధితులను గతంలో నల్గొండ నుంచి హైదరాబాద్​కు తరలించేవారు.

ఇదీ చూడండి :వైద్యం కోసం ఇబ్బందులు... భయాందోళనలో స్థానికులు

ABOUT THE AUTHOR

...view details