తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్ ఉపఎన్నికకు తొలి రోజు 5 స్వతంత్ర నామినేషన్లు​

నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి నామినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేశారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతిని ప్రశ్నించేందుకు ప్రజల గొంతుకగా మారేందుకే పోటీ చేస్తున్నామని స్వతంత్రులు తెలిపారు.

5 independent candidates filed nominations in nagarjunasagar by elections
5 independent candidates filed nominations in nagarjunasagar by elections

By

Published : Mar 23, 2021, 7:35 PM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నికలో భాగంగా... నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు ఐదుగురు స్వత్రంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన గౌటి మల్లేష్, కరీంనగర్​కు చెందిన సిల్వేరి శ్రీకాంత్, మేడ్చల్ జిల్లా ఉప్పల్​కు చెందిన రేవు చిన్న ధనరాజ్, మల్కాజిగిరికి చెందిన లోగ్గారి రమేశ్​లు తొలి రోజు నామినేషన్లు వేశారు.

రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, అవినీతిని... ప్రజల తరఫున ప్రశ్నించేందుకు నాగార్జునసాగర్​లో పోటీ చేస్తున్నామని కలియుగ పాండవుల వ్యవస్థాపకులు చిన్న ధనరాజ్ తెలిపారు. ఉద్యోగ విరమణ వయసు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని... వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 వేల ఉద్యోగాల ప్రకటన హామి నిలబెట్టుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగని సమాజ రక్షకులు అందరూ కలియుగ పాండవులేేనన్నారు.

తమలో ఎవరు గెలిచినా సాగర్​లో ఒక నవశకపు అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపుతామన్నారు. ఓటు... కూతురు లాంటిదని దయచేసి డబ్బుకో, మందుకో అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: '45 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా'

ABOUT THE AUTHOR

...view details