నల్గొండ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మూడు రోజుల్లోనే... 69 మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కొత్తగా 28 మందికి వ్యాధి సోకినట్లు... జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పేర్కొన్నారు. అత్యధికంగా మిర్యాలగూడలో 10, దేవరకొండలో 8, నల్గొండలో 6, చిట్యాలలో 2 కేసులు నమోదవగా... గుడిపల్లి, నార్కట్పల్లి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
నల్గొండ జిల్లాలో కరోనా కోరలు... ఈ రోజు 28 కేసులు - nalgonda news
కరోనా మహమ్మారి నల్గొండ జిల్లాలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలో ఈరోజు 28 కేసులు నమోదవగా... ఒకరు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
28 corona cases in nalgonda district
కొవిడ్ బారిన పడి మిర్యాలగూడ వాసి ప్రాణాలు కోల్పోగా... జిల్లాలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో గురువారం 17, శుక్రవారం 24, ఇవాళ 28 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.