తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీకి 207 వలస కూలీల తరలింపు - migrant labourers move from Telangana

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు స్వస్థలాలకు వెళ్లవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేయటం వల్ల సరిహద్దుల వద్ద తెలుగు రాష్ట్రాల అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు, ప్రజలు వాహనాల్లో స్వరాష్ట్రాలకు బయలుదేరారు.

207 migrant labourers move from Telangana state to Andhra Pradesh
ఏపీకి 207 వలస కూలీల తరలింపు

By

Published : May 10, 2020, 12:30 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అంతర రాష్ట్ర సరిహద్దు వద్ద లాక్​డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రం నుంచి వలసకూలీలు ఆంధ్రప్రదేశ్​లోని వివిధ జిల్లాలకు చెందిన వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. 207 మంది వలస కూలీలకు ఆరోగ్య పరీక్షల అనంతరం వారిని అధికారులు ఏపీకి పంపించారు.

ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన 168 మంది, ఒంగోలు జిల్లా వారు 4 గురు, గుంటూరుకి చెందిన 29 మంది, కడప జిల్లాకు సంబంధించిన 2, నెల్లూరుకు చెందిన ఒక్కరిని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాళ్లను 6 బస్సుల్లో తరలించారు.

ABOUT THE AUTHOR

...view details