నల్గొండ జిల్లా చండూర్కి చెందిన రాపోలు సత్యనారాయణ ఆరు సంవత్సరాల క్రితం ఒక బొప్పాయి మొక్కను నాటాడు. ఒక సంవత్సరానికి కాయలు కూడా కాశాయి. కానీ ఈదురు గాలులు ఎక్కువగా రావడం వల్ల చెట్టు తల భాగం విరిగిపోయింది. చెట్టును తీసేద్దామనుకునే సమయంలో... చెట్టుపైన కొన్ని కొమ్మలు వచ్చాయి. కొమ్మలు ఇగురు వస్తుడటం చూసి అలాగే పెంచాడు.
బొప్పాయి చెట్టుకు బోలెడు కొమ్మలు - 20 BRANCHES IN ONLY ONE PAPAYA TREE
బొప్పాయి చెట్టుకు కొమ్మలున్నాయంటే ఆశ్చర్యపోతున్నారు కదా... అవునండీ ఈ చెట్టును చూసాక చెప్పక తప్పడం లేదు మరి. దాదాపు 30 అడుగలో పొడవు, 20 కొమ్మలతో... అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేనా ప్రతీ కొమ్మకు 20 తియ్యటి పండ్లను ఇస్తూ ఆనందపరుస్తోంది.

బొప్పాయి చెట్టుకు బోలెడు కొమ్మలు
ప్రస్తుతం ఈ చెట్టు 30 అడుగుల ఎత్తు పెరిగి దాదాపు 20 కొమ్మలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతే కాదండోయ్... ప్రతీ కొమ్మకు 20 వరకు కాయలు కూడా కాస్తూ... తియ్యటి పండ్లను ఇస్తున్నాయి.
బొప్పాయి చెట్టుకు బోలెడు కొమ్మలు
ఇవీ చూడండి: వ్యవసాయాన్ని పండగ చేద్దాం