తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.50 వేల అప్పు ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది! - two people died

యాభై వేల అప్పు ఇద్దరిని మృత్యు ఒడికి చేర్చింది. అప్పు ఇచ్చిన వ్యక్తిని, తీసుకున్న వ్యక్తిని బలిగొన్న ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇద్దరి ప్రాణాలు తీసిన యాభైవేల అప్పు

By

Published : Nov 18, 2019, 10:39 AM IST

ఇద్దరి ప్రాణాలు తీసిన యాభైవేల అప్పు

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండమల్లెపల్లికి చెందిన నర్రా నారయ్య, యాదగిరికి లక్ష రూపాయలు అప్పు ఇచ్చాడు. యాభై వేలు అప్పు తీర్చగా మిగిలిన డబ్బులు తీర్చడం యాదగిరికి కష్టంగా మారింది. ఈ విషయమై ఈ నెల 13న ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నారయ్య పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్​కు వెళ్తుండగా ఆవరణలో హైబీపీతో కిందపడిపోయాడు.

ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16న నారయ్య మృతి చెందాడు. మృతుని బంధువులు నీ అప్పు వల్లే యాదగిరి చనిపోయాడని ఆరోపించగా... యాదగిరి భయంతో పురుగుల మందు తాగాడు. అనంతరం దేవరకొండలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: తప్పిన గోల్​... పగిలిన లైట్​ పోల్​

ABOUT THE AUTHOR

...view details