నల్గొండ జిల్లా దామరచర్ల మండలం అడవిదేవులపల్లి వద్ద కృష్ణా నదిపై నిర్మించిన టెయిల్‌పాండ్‌కు వరద ప్రవాహం పెరగ్గా.... 18 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదిలో నీటి ఉద్ధృతి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని కృష్ణా నదిలోకి వదులుతుండగా... టెయిల్పాంట్ నిండు కుండలా మారింది.
టెయిల్‌పాండ్ 18 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల - krishna river news
నల్గొండ జిల్లాలోని టెయిల్‌పాండ్‌కు వరద ఉద్ధృతి పెరింది. 75.50 అడుగులకు గానూ 74.65 అడుగుల వరకు నీరు చేరుకోగా.. 18 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు.
18 gates open in tail pond project
టెయిల్‌పాండ్ సామర్థ్యం 7.08 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.507 టీఎంసీల వరకు నీటిని నిల్వ ఉంది. 75.50 అడుగులకు గానూ 74.65 అడుగులు వరకు నీరు చేరుకుంది. టెయిల్‌పాండ్‌లో 20 గేట్లకు గానూ 18 గేట్ల నుంచి 32 33 26క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.