తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్క రోజులోనే కరోనాతో 12 మంది మృతి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనాతో 10 మంది, కొవిడ్ నుంచి కోలుకున్నాక బ్లాక్​ ఫంగస్ బారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు . ​

corona deaths in nalgonda
ఒక్క రోజులోనే కరోనాతో 12 మంది మృతి

By

Published : May 18, 2021, 11:58 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనాతో... సోమవారం 12 మంది మృత్యువాత పడ్డారు. బ్యాంకు అసిస్టెంట్ మేనేజరు, రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు, వీఆర్ఏ, అంగన్వాడీ ఆయా... ఇలా పలువురు ప్రాణాలు కోల్పోయారు. చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో 70 ఏళ్ల వృద్ధురాలు... చింతపల్లి మండలానికి చెందిన ఓ యువకుడు పెళ్లయిన రెండు నెలలకే కొవిడ్ బారిన బారిన పడి ప్రాణాలు వదిలారు.

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ... బ్లాక్ ఫంగస్ బారిన పడి చిట్యాల మండలంలో ఒకరు మృతి చెందారు. ఆరెగూడెం గ్రామానికి చెందిన 57 ఏళ్ల వ్యక్తి... 25 రోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డారు. క్వారంటైన్లో ఉండి కోలుకున్నా... మూడు రోజుల నుంచి ఒంటి నొప్పులతోపాటు జ్వరం వచ్చి కంటి చూపు మందగించింది. వెంటనే అతన్ని ఆదివారం గాంధీ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

ABOUT THE AUTHOR

...view details