నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో.. ఎలిమినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు... 36 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు తొలి 3 స్థానాల్లోని అభ్యర్థులకు జమ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి 144 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 132 ఓట్లు, కోదండరామ్‌కు 143 ఓట్లు జమ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల జమ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,984 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 83,422 ఓట్లు, కోదండరాంకు 70,215 ఓట్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎలిమినేషన్ పూర్తయిన అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి వచ్చిన మొత్తం ఓట్లు... 10 నుంచి 15 లోపు ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇలా పోలై, చెల్లబాటు అయిన ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చే వరకు ఇలా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఎవరికెన్ని రావాలి..