ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ మండలం మన్ననూరు ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహన్ హాజరయ్యారు.
కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి జాతీయ జెండాను ఎగరవేశారు. ఆదివాసీల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఆదివాసీల కోసం ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారని చెప్పారు.