తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య - crine news

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్​కర్నూల్​ పట్టణంలో చోటుచేసుకుంది. కూమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

women suicide with financial problems in nagarkarnool
women suicide with financial problems in nagarkarnool

By

Published : Jul 22, 2020, 5:20 PM IST

నాగర్‌కర్నూలు పట్టణంలోని కేసరిసముద్రం చెరువులో పడి ఓ మహిళ మృతిచెందింది. పురపాలక సంఘం పరిధి ఉయ్యాలవాడకు చెందిన నాగపురం చంద్రమ్మ(43) కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. మంగళవారం రోజు ఎవ్వరూ లేని సమయంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పంచనామా నిర్వహించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details