నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన పూజారి రాధ అనే గర్భిణీ వైద్య పరీక్షల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కొల్లాపూర్ ఆసుపత్రికి బయలుదేరింది. కల్వకోలు-కొల్లాపూర్ మార్గమధ్యలో నొప్పులు రావడం వల్ల రోడ్డుపక్కనే ప్రసవించింది. విషయం తెలుసుకున్న కల్వకోలు గ్రామానికి చెందిన యువకులు మురళీమోహన్, గిరి ప్రసాద్, సోమిశెట్టి ప్రదీప్, వెంకటేశులు ప్రసవమైన మహిళకు అండగా నిలిచారు. కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు.
రోడ్డుపక్కనే ప్రసవించిన మహిళ.. ఆసుపత్రికి తరలించిన యువకులు - కల్వకోలు-కొల్లాపూర్ మార్గమధ్యలో ప్రసవించిన మహిళ వార్తలు
వైద్య పరీక్షలకు ఆసుపత్రికి వెళుతున్న ఓ గర్భిణీ రోడ్డు పక్కనే ప్రసవించింది. గమనించిన స్థానిక యువకులు సదరు మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
రోడ్డుపక్కనే ప్రసవించిన మహిళ.. ఆసుపత్రికి తరలించిన యువకులు
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మహిళకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీచూడండి.. పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం.. పట్టుకున్న పోలీసులు