వారిద్దరు ప్రజాప్రతినిధుల తనయులు. గ్రామంలోని సమస్యలను చర్చించటానికి వాట్సాప్‌ను వేదికగా చేసుకున్నారు. ఇంతలో ఏమైందో వాట్సాప్ గొడవ కాస్తా భౌతిక దాడులకు దారి తీసింది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతపూర్లో ఇరు వర్గాలు ఒకరి ఇంటిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.
వాట్సాప్ గ్రూప్ వార్తో మొదలై.. పలువురు ఆసుపత్రిలో చేరేదాకా..! - ఒకరిపై ఒకరు దాడి
ఇద్దరు ప్రజాప్రతినిధుల తనయుల వాట్సాప్ చాటింగ్ గొడవకు దారి తీసింది. గ్రామంలోని సమస్యలపై సింగిల్ విండో ఛైర్మన్, సర్పంచ్ కుమారుల మధ్య వివాదం నడిచింది. ఈ సమస్య కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. దీంతో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
వాట్సాప్ చాటింగ్...రెండు వర్గాలకు గాయాలు
గ్రామంలోని సమస్యలపై రాత్రి సింగిల్‌విండో ఛైర్మన్ తనయుడు, సర్పంచ్ తనయుడు సామాజిక మాధ్యమంలో చాటింగ్ చేసుకున్నారు. వారిద్దరి మధ్య వివాదం కాస్తా రగిలి పెద్ద గొడవగా మారింది. తెరాసకు చెందిన ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ సంఘటనలో పలువురికి గాయాలవ్వగా వారిని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించి, పికెటింగ్ ఏర్పాటు చేశారు.