నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో రాజవర్దన్రెడ్డి అనే ఓటరు వింత చర్యకు పాల్పడాడు. ఓటు వేసిన అనంతరం బ్యాలెట్ పేపర్ని బాక్సులో వేయకుండా చించేశాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా... పోటీలో నిలబడిన వ్యక్తులు తనకు నచ్చలేదని సమాధానమిచ్చాడు. మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని పోలీసులు తెలిపారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసి... క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
బ్యాలెట్ చించేశాడు... కేసులో ఇరుక్కున్నాడు
ఓటేయగానే గెలిచినవారు పార్టీ మారిపోతున్నారన్న కోపమో... మరే కారణమో కానీ ఈ ఓటరు ఓటేసిన అనంతరం బ్యాలెట్ పేపరును బాక్సులో వేయకుండా చించేశాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో జరిగింది.
బ్యాలెట్ పేపరు