నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం ఆసుపత్రిని అక్కడే నిర్వహించాలని రామాపురం, బోయాలపల్లి గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. 150 పడకల ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా... వేరే ప్రాంతానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రి ఉన్న దగ్గరే నిర్మాణం చేపట్టాలని ప్లకార్డులు పట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. ఆసుపత్రిని తరలించడానికి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుమతి ఇవ్వడం సరైంది కాదన్నారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రామాపురం గ్రామ సమీపంలోనే నిర్మిచాలని కోరుతూ... కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిపారు.
ఆసుపత్రిని తరలించవద్దంటూ గ్రామస్థుల ధర్నా - against to hospital shifting
నాగర్‌కర్నూలు జిల్లా రామాపురం ఆసుపత్రిని వేరే ప్రాంతానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ... గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్విహించారు.
ఆసుపత్రిని తరలించవద్దంటూ గ్రామస్థుల ధర్నా