గత 20 రోజులుగా పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం రిజర్వాయర్ ముంపు బాధితులు ఆందోళన కొనసాగుతోంది. పరిహారం తొందరగా వచ్చేలా చేయాలంటూ గతంలో వట్టెం వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం ఇచ్చారు. ఇవాళ సంతు సేవాలాల్ మహారాజ్‌కు మహాబోగ్ నిర్వహించి నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్థులు తెలిపారు. మల్లన్నసాగర్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం
పరిహారం చెల్లించాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం రిజర్వాయర్ ముంపు బాధితులు ఇవాళ సంతు సేవాలాల్ మహారాజ్‌కు మహాబోగ్ నిర్వహించారు. మల్లన్నసాగర్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేశారు.
న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం