తెలంగాణ

telangana

ETV Bharat / state

వట్టెం భూ నిర్వాసితుల ఆందోళన.. - Vattem protest

వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్​లో తమ భూములు కోల్పోతున్న భూనిర్వాసితులు నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఆందోళన చేపట్టారు.

భూ నిర్వాసితుల ఆందోళన..

By

Published : Jun 18, 2019, 11:16 PM IST


పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ భూ నిర్వాసితులు బిజినేపల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్​లో భూములు కోల్పోతున్న నిర్వాసితులు గత కొంతకాలంగా తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ.. ఆందోళనలు చేస్తున్నారు. నిన్న ప్రగతిభవన్ ముట్టడికి పాదయాత్రగా బయల్దేరిన ఆందోళనకారులను జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టుకు నిరసనగా... ఈరోజు బిజినేపల్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల పోలీసులు నిర్వాసితులతో చర్చించి ధర్నాను విరమింపజేశారు.

వట్టెం భూ నిర్వాసితుల ఆందోళన..

ABOUT THE AUTHOR

...view details