వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూల్ జిల్లాలో దేవాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ప్రధానంగా నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ స్వామివారి సేవలో తరించారు.
జిల్లాలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు - వైకుంఠ ఏకాదశి వార్తలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే మంత్రోచ్ఛారణలతో ఆలయాలు మారుమోగాయి. భక్తులు ధూప, దీప నైవేధ్యాలతో తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.
ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు
తెల్లవారుజాము నుంచి రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మహిళలు ధూప, దీప నైవేద్యాలతో తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. వేదమంత్రోచ్ఛారణలతో ఆలయాలు మారుమోగాయి.
ఇదీ చూడండి:జేడీయూకు షాక్- భాజపాలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు