తెలంగాణ

telangana

ETV Bharat / state

కులమతాలకు అతీతంగా ఉరుసు ఉత్సవం - వట్టెం గ్రామంలో ఉర్సు ఉత్సవాలు

నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినాపల్లి మండలం వట్టెం గ్రామంలో హజ్రత్‌ రుస్తుం అలీషా రెండవ ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మావతి, డీసీసీబీ డైరెక్టర్‌ రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు దర్గాకు తరలి వస్తున్నారని ఛైర్‌పర్సన్‌ పేర్కొన్నారు.

ursu festival, vattem village
ఉర్సు ఉత్సవం, వట్టెం గ్రామం

By

Published : Feb 4, 2021, 9:26 AM IST

కులమతాలకు అతీతంగా, మత సామరస్యానికి ప్రతీకగా హజ్రత్ రుస్తుం అలీషా ఉరుసు మహోత్సవం నిర్వహించడం గొప్ప విషయమని జడ్పీ ఛైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్‌ జిల్లా బిజినాపల్లి మండలం వట్టెం గ్రామంలో రెండవ ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు. వట్టెం గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా గంధత్సోవం నిర్వహిస్తోన్న నిర్వాహకులను ఛైర్‌పర్సన్‌ అభినందించారు. హజ్రత్ రుస్తుం అలీ బాబా సేవలను కొనియాడారు.

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రూ. 30 లక్షల నిధులతో దర్గాను అభివృద్ధి చేశారని పద్మావతి పేర్కొన్నారు. దర్గాలో వంటశాల, భోజనశాల కోసం ఎమ్మెల్యే రూ. 5 లక్షలు మంజూరు చేయనున్నారని ప్రకటించారు. ఈ గంధోత్సవంలో దర్గా పీఠాధిపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఫాతిహా, ఖవ్వాలి, అన్నదానం నిర్వహించారు.

ఇదీ చదవండి:6న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధనం: తమ్మినేని

ABOUT THE AUTHOR

...view details