తెలంగాణ

telangana

ETV Bharat / state

గుర్తు తెలియని మృతదేహం లభ్యం.. హత్యగా అనుమానం! - నాగర్​ కర్నూల్​ క్రైమ్​ వార్తలు

నాగర్​ కర్నూల్​ పట్టణంలోని చెరువులో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్యగా భావించి కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేసి.. నిందితులను పట్టుకుంటామని సీఐ గాంధీ నాయక్​ తెలిపారు.

Unknown Dead body Found In Nagar karnool Kesari Samudram
గుర్తు తెలియని మృతదేహం లభ్యం.. హత్యగా అనుమానం!

By

Published : Jul 26, 2020, 8:35 PM IST

నాగర్ కర్నూలు పట్టణంలోని కేసరి సముద్రం చెరువులో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పట్టణంలోని కేసరి సముద్రం చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు 50 నుంచి 55 వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

మెడకు తాడుతో కట్టి మరోవైపు తాడును రాయితో కట్టి చెరువులో పడవేశారు. మృతదేహం నీటిపై తేలకుండా ఉండేందుకు రాయితో కట్టి చెరువులో పారేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు ఐదు రోజుల క్రితం చంపి ఉంచారని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని సీఐ గాంధీ తెలిపారు.

ఇవీ చూడండి:శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ABOUT THE AUTHOR

...view details