నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పలు మండాలకు చెందిన పోలీసు సిబ్బందితో కలిసి వెల్దండ మండల కేంద్రం నుంచి వంగురూ మండల కేంద్రం వరకు ర్యాలీ కొనసాగించారు.
శిరస్త్రాణం ధరించాలని పోలీసుల ద్విచక్ర వాహన ర్యాలీ - nagar kurnool district news
ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు శిరస్త్రాణం ధరించాలని కోరుతూ వెల్దండ మండల పరిధిలో పోలీసులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేశారు. కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసు అధికారి అన్నారు.
శిరస్త్రాణం ధరించాలని పోలీసుల ద్విచక్ర వాహన ర్యాలీ
ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు శిరస్త్రాణం ధరించాలని సీఐ నాగరాజు అన్నారు. కారు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఆయన సూచించారు. వాహనాలు నడిపే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు.
ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..