నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తూడుకుర్తికి చెందిన మహేశ్ గొర్రెలు అదే గ్రామానికి చెందిన నక్క శ్రీనివాసులు పంటను మేశాయి. శ్రీనివాసులు పరిహారం ఇప్పించాలని పంచాయతీ పెట్టాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ విచారణ మొదలైంది.
నక్క శ్రీనివాసులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నేను ఎందుకు చెల్లించాలి, నా ఒక్కడి గొర్రెలు చేనులో పడలేదు, చాలా మంది గొర్రెలు పడ్డాయి, నేను చెల్లించనని మహేశ్ చెప్పటంతో గొడవ మొదలైంది.