విద్యా వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. నిరుపేద విద్యార్థులందరికీ విద్యనందించేలా గురుకులాలను ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వివరించారు. పీఆర్సీని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరగా... సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో టీఎస్‌యూటీఎఫ్ తృతీయ మహాసభలను నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థ నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల జీవితం అన్ని రకాలుగా బాగుంటేనే మంచిదని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థలో చాలా మార్పులను చేయాలని సూచించారు.