నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మానవహారంగా ఏర్పడ్డారు. గాంధీ ధర్నా చౌక్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించారు. అక్కడే కూర్చొని భోజనాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'బంగారు తెలంగాణ అంటే బర్రెలు, గొర్రెలు కాయడమా?'
నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బంగారు తెలంగాణ అంటే బర్రెలను గొర్రెలను కాసుకోవడమేనా అంటూ ఆర్టీసీ కార్మికులు ప్రశ్నించారు.
నాగర్‌కర్నూలులో ఆర్టీసీ కార్మికుల మానవహారం
బంగారు తెలంగాణ అంటే బర్రెలను, గొర్రెలను కాసుకోవడమా అంటూ ఆర్టీసీ కార్మికులు ప్రశ్నించారు. ఇలాంటి దుశ్చర్యను ప్రజలు సహించబోరన్నారు. రోడ్డుపై బైఠాయించగా వాహనదారులకు, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇవీ చూడండి: కార్తిక పౌర్ణమి దీపాల వెలుగులు