నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మె 19వ రోజు కొనసాగుతోంది. కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు మద్దతు తెలపాలని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి చేరుకొని ధర్నా నిర్వహించారు.సమస్యలను ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. హర్షవర్ధన్ రెడ్డి ఇంటి ముందు కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లేకపోవడం వల్ల పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కొల్లాపూర్ మార్కెట్ యార్డు ఛైర్మన్ నరేందర్ రెడ్డికి అందజేశారు. అనంతరం ఎంపీపీ కార్యాలయం చేరుకుని వినతి పత్రం అందజేశారు.
ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఇంటిని ముట్టడించిన కార్మికులు - tsrtc bus strike news today
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె శిబిరం ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఇంటిని ముట్టడించిన కార్మికులు
ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఇంటిని ముట్టడించిన కార్మికులు