నాగర్కర్నూర్
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో తెరాసకు స్పష్టమైన అధిక్యం ఉండటం వల్ల ఛైర్మన్ పీఠం తెరాసకు కైవసం అయింది. నాగర్కర్నూల్ మున్సిపల్ ఛైర్పర్సన్గా కల్పన, వైస్ ఛైర్మన్గా భాస్కర్రావు ఎన్నికయ్యారు.
కల్వకుర్తి
కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 స్థానాలకు తెరాస 10 వార్డులు గెలుచుకుంది. నలుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ సత్యం, వైస్ ఛైర్మన్గా షాయాద్ ఎన్నికయ్యారు.
కొల్లాపూర్
కొల్లాపూర్ మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ ఉన్న ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు ఛైర్మన్ పదవిని దక్కించుకోలేకపోయారు. తెరాసకు ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో ఛైర్మన్ పీఠం కైవసమైంది. దీనితో మున్సిపల్ ఛైర్పర్సన్గా విజయలక్ష్మి, వైస్ ఛైర్పర్సన్గా మహముదా బేగం ఎన్నికయ్యారు.
అచ్చంపేట
అచ్చంపేట మున్సిపాలిటీలో ఎన్నికలు జరగలేదు. పదవీకాలం ముగియకపోవడం వల్ల వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించనున్నారు.
బస్తీకా బాద్షా: నాగర్కర్నూర్లోని ఛైర్మన్ల పీఠం.. తెరాస కైవసం