దేశం కోసం అహర్నిశలు పోరాడే వీర జవాన్ల త్యాగాలను మనం ఎప్పటికీ గుర్తుచేసుకోవాలని... నాగర్ కర్నూల్ జిల్లా భాజపా నాయకులు అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అమరులైన వీర జవాన్లకు జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. పాకిస్థాన్ ప్రేరేపిత సంస్థ జైషే మహమ్మద్ జరిపిన ఈ దాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
'జవాన్ల త్యాగాలను ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి' - Nagar Kurnool district latest news
పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు నాగర్ కర్నూల్ జిల్లాలో భాజపా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం అహర్నిశలు పోరాడే వీర జవాన్లను యువత ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
జవాన్ల త్యాగాలను ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి
జిల్లా భాజపా కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి... అంబేడ్కర్ చౌరస్తా వద్ద జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. పుల్వామా ఘటన జరిగి నేటికి రెండేళ్లయినా ఆ ఘటన ఇప్పటికీ మన కళ్లముందు జరిగినట్లుగా కనిపిస్తోందని నాయకులు అన్నారు. దేశం కోసం అహర్నిశలు పోరాడే వీర జవాన్లను యువత ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: పుల్వామా అమరులకు ప్రముఖుల నివాళి