శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూగర్భజల కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో.. కేంద్రంలోని ఆరు యూనిట్లలో.. రెండు యూనిట్లు ( నాలుగు, ఆరు) పాడైనట్లుగా అధికారులు గుర్తించారు. ఈ రెండు యూనిట్లు మినహా మిగతా వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించారు.
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ట్రయల్ రన్ విజయవంతం - Srisailam Left Bank Hydroelectric Power Station
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూగర్భ జల కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో పాడైన యూనిట్లు మినహా మిగతా వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలను పరిశీలించారు.
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం
మొదటగా ఒకటి, రెండు యూనిట్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. రెండో యూనిట్లో ట్రయల్ రన్ జరిపారు. సుమారు అరగంటపాటు 100 ఆర్సీఎం వేగంతో నీటిలో టర్బైన్ స్పిన్ నిర్వహించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా తిరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.