నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు... టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. గట్టుకాడిపల్లి, కంసానిపల్లి, తిరుమలాపురం మీదుగా నడుస్తూ... పొలం పనులు చేస్తున్న రైతులు, కూలీలతో ముచ్చటించారు. రైతు వ్యతిరేక చట్టం గురించి వివరించి... రైతుల సమస్యలను తెలుసుకున్నారు. మద్దతు ధర, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుబంధు ఇచ్చినట్టే ఇచ్చి... ఇతర ఖర్చులు విపరీతంగా పెంచిందని ఆరోపించారు.
రెండో రోజుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర.. ప్రజా సమస్యలపై ఆరా
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. మార్గమధ్యలో రైతులు, కూలీలతో ముచ్చటిస్తూ... సమస్యలు తెలుసుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు జరిగే నష్టాలకు గురించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు.
రెండో రోజుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర.. ప్రజా సమస్యలపై ఆరా
కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకు కేంద్రం తెచ్చిన చట్టాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. త్యాగలతో తెలంగాణ తెచ్చుకున్నది... ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రీకొడుకులు కొట్లాడుకునేందుకేనా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు.