నాగర్ కర్నూల్ జిల్లాలో టీపీసీసీ అధికార ప్రతినిధి సతీశ్ మాదిగను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అచ్చంపేటలోని కన్నయ్య రైస్‌మిల్ వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాజీవ్ రైతు భరోసా దీక్షకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి గృహ నిర్బంధం - కొరటికల్ గ్రామంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గృహనిర్బంధం
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొనే రాజీవ్ రైతు భరోసా దీక్షకు వెళ్తున్న టీపీసీసీ అధికార ప్రతినిధి సతీశ్ మాదిగను పోలీసులు అడ్డుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం కొరటికల్ గ్రామంలో ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. కాంగ్రెస్ నాయకుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే సమాచారంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి గృహ నిర్బంధం
కాంగ్రెస్ నాయకుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు సతీశ్ వెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుందనే సమాచారంతో ఉప్పునూతల మండలం కొరటికల్ గ్రామంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అచ్చంపేట కాంగ్రెస్‌లో వంశీకృష్ణ, సతీశ్ మాదిగ వర్గాలకు గతంలో గొడవలు జరిగాయి. ఇరువర్గాల తగాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయనతో పాటు అనుచరులను గృహా నిర్బంధం చేయడంతో అక్కడే కూర్చొని దీక్ష చేపట్టారు.