Revanth reddy Comments: ప్రశాంత్ కిశోర్‌తో కలిసి సీఎం కేసీఆర్ కొత్త నాటకాలకు తెర తీశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 'మన ఊరు- మన పోరు' సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిసెంబర్‌లో కేసీఆర్ ప్రభుత్వం రద్దవుతుందని.. వచ్చే మార్చికల్లా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని రేవంత్ జోస్యం చెప్పారు. 12 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెరాస మంత్రులు, నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక పాలమూరును సస్యశ్యామలం చేస్తానని.. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
'డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దు.. మార్చికల్లా ఎన్నికలు.. అధికారంలోకి కాంగ్రెస్..' - congress meeting in Kollapur
Revanth reddy Comments: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 'మన ఊరు- మన పోరు' సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే మార్చికల్లా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని రేవంత్ జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో వచ్చే కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
"తెరాస పార్టీ 2 సార్లు గెలిచి, 8 ఏళ్లుగా పదవిలో ఉండి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. శ్రీశైలం ముంపు బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు. ఇస్తామన్న పరిహారం, ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేదు. తెరాస గెలిస్తే శ్రీశైలం నిర్వాసితులను ఆదుకుంటానని కేసీఆర్ అన్నారు. జీవో నం.98 బాధితులను ఆదుకుంటానని కేసీఆర్ చెప్పారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ఇతరులకు ఇవ్వాలి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కాంగ్రెస్ హయాంలోనే 30 కి.మీ. పూర్తయింది. తెరాస ప్రభుత్వం 8 ఏళ్లుగా 10 కి.మీ. టన్నెల్ తవ్వలేకపోయింది. వాల్మీకి బోయలను ఎస్టీలలో చేరుస్తానని చెప్పి మోసం చేశారు. ముదిరాజ్, బెస్తల జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా..? ఒక్క ముదిరాజ్ ఎదిగితే నిందలు వేసి బయటకు పంపారు. ఎస్సీ వర్గీకరణ సాధిస్తానని చెప్పి ఎస్సీలనూ మోసం చేశారు. డిసెంబర్‌లో కేసీఆర్ ప్రభుత్వం రద్దవుతుంది. వచ్చే మార్చికల్లా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. 12 నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: