తెలంగాణ

telangana

ETV Bharat / state

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్

రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి పురపాలిక సంఘం పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను కలెక్టర్​ శ్రీధర్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

To be informed from time to time at nagarkurnool
'ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలి'

By

Published : Jan 8, 2020, 4:25 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక సంఘం పరిధిలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా పరిపాలనాధికారి శ్రీధర్ ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు స్వీకరించే 22 వార్డులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామపత్రాలు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థుల వద్ద అన్ని వివరాలు తీసుకోవాలన్నారు. వార్డు ఓటరు లిస్టు, పురపాలక సంఘానికి సంబంధించిన ఓటర్ల జాబితా ఉండాలని సూచించారు.

అభ్యర్థి నామినేషన్ పత్రాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే నామినేషన్​కు అంగీకరించాలన్నారు. పురపాలక సంఘం కమిషనర్ బాలచంద్ర సృజన్​తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేష్ కుమార్, తహశీల్దార్ రామ్ రెడ్డి, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

'ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలి'

ఇదీ చూడండి : పనికి చేరారు.. మత్తుమందు పెట్టి మొత్తం ఊడ్చేశారు..

ABOUT THE AUTHOR

...view details