'గొర్రె పిల్లను బలిపీఠం మీదకు రమ్మన్నట్లుంది' - కోదండరాం నాగర్కర్నూల్ పర్యటన
ఆర్టీసీ కార్మికులు గౌరవంగా ఉద్యోగం చేసుకునే విధంగా చర్చలు లేవని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం గాంధీ చౌక్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు.
కోదండరాం నాగర్కర్నూల్ పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి గడువు విధించారు కానీ... ఇప్పటివరకు వారి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. మిగిలిన ఆర్టీసీ బతకాలంటే ప్రభుత్వ సాయం అవసరముందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేరమని ఆహ్వానించిన తీరు... గొర్రె పిల్లలను బలిపీఠం మీదకు ఆహ్వానించినట్లుందని ఎద్దేవా చేశారు.
- ఇదీ చూడండి : అమానుషం... అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దారుణ హత్య