నాగర్కర్నూల్ జిల్లాలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పర్యటించారు. అచ్చంపేటలో గ్రామస్థులతో సమావేశమయ్యారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాల పోరాడుతామని తెలిపారు. గ్రామస్థులతో యురేనియంకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి గవర్నర్కు పంపించాలని నిర్ణయించారు. ప్రజాఉద్యమం కారణంగానే అసెంబ్లీలో ప్రభుత్వం నల్లమలపై తీర్మానం చేసిందని తెలిపారు. యురేనియం తవ్వకాలతో కృష్ణానది పరివాహన ప్రాంత ప్రజల ఆరోగ్యపై ప్రభావం చూపుతుందన్నారు.
నల్లమలపై ప్రజలపక్షాన పోరాడుతాం: కోదండరాం - kodandaram
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి గవర్నర్కు పంపుతామని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. యురేనియం తవ్వకాలపై ప్రజలపక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
నల్లమలపై ప్రజలపక్షాన పోరాడుతాం: కోదండరాం