నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొల్ల చింతలపల్లి గ్రామ సమీపంలో ఉన్న నల్లమల అడవిలో పులి పాదముద్ర అటవి శాఖ అధికారులు గుర్తించారు. ఊరి దగ్గర్లో అడుగు జాడలు కనిపించగా.. గ్రామంలో కలకలం రేగింది.
నల్లమల సమీప పల్లెలో పులి అడుగు జాడలు - తెలంగాణ వార్తలుట
కొల్లాపూర్ మండల సమీపాన ఉన్న నల్లమల అడవిలో పులి పాదముద్రలను అటవి శాఖ అధికారులు గుర్తించారు. మొల్ల చింతలపల్లి గ్రామ సమీపంలో అడుగు జాడలు కనిపించగా.. గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామ సమీపంలో పులి అడుగు జాడలు
పర్యవేక్షణలో భాగంగా బీట్ అధికారి, మరికొంతమంది నల్లమల అడవిలోకి వెళ్లారు. దారిలో పులి పాదముద్రలను వారు గుర్తించారు. గ్రామ సమీపాన పులి తిరిగినట్లు అటవీశాఖ అధికారి రవీందర్ నాయక్ తెలిపారు. గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి:ఆ ఐదుగురు బాలికలను ఆదుకుంటాం: సత్యవతి