ట్రాక్టర్ బోల్తా... ముగ్గురు మృతి - three died
నాగర్కర్నూల్లో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులందరూ ఒకే గ్రామానికి చెందిన వాళ్లు కావటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి
నాగర్కర్నూల్ జిల్లా నల్లవెల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులు నిర్వహించుకుని ట్రాక్టర్లో ఇంటికి వస్తుంటే బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులు లింగసానిపల్లికి చెందిన జయమ్మ, గౌరమ్మ, తిక్కన్నగా గుర్తించారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షత్రగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.