నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎలికట్ట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక దుందుభి వాగులో యువకుడు పడి మృతి చెందాడు. హైదరాబాద్ బడంగ్‌పేటకు చెందిన చరణ్ అనే యువకుడు తన బంధువుల ఊరైన ఎల్లికట్ట గ్రామానికి గత రెండు రోజుల క్రితం వచ్చాడు. ఆదివారం సరదాగా గ్రామ శివారులోని వాగుకు ఈత కోసం వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
బంధువుల ఇంటికి వచ్చి అనంత లోకాలకు... - The young man died in Nagarkarnool district
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో దుందుభి వాగులో మునిగి యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు కాపాడేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
బంధువుల ఇంటికి వచ్చి అనంత లోకాలకు...
కుటుంబ సభ్యులు, స్థానికులు కాపాడేందుకు ప్రయత్నాలు చేసినప్పటికే ఫలితం లేకుండా పోయింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ వివరించారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి:కేసీఆర్ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?
TAGGED:
The young man died