తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యపాన నిషేధానికి గ్రామ మహిళలు తీర్మానం - బెల్టు షాపులు ఎత్తివేయాలని ఆందోళన చేశారు.

ఆ గ్రామంలో మద్యపానం నిషేధించాలని మహిళలు తీర్మానించుకున్నారు. బెల్టు షాపులు ఎత్తివేయాలని ఆందోళన చేశారు. ర్యాలీగా వెళ్లి జిల్లా కేంద్ర ఎక్సైజ్ కార్యాలయంలోని సీఐ ఏడుకొండలుకు వినతి పత్రం అందజేశారు. తమ ఊరిలో మద్యపానం బంద్​ చేయాలని, బెల్టు షాపులు ఎత్తివేయాలని కోరారు.

The women in the village decided to ban drinking
ఆ గ్రామంలో మద్యపానం నిషేధానికై మహిళలు తీర్మానించుకున్నారు

By

Published : Dec 19, 2019, 10:33 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో మద్యం నిషేధించాలని మహిళలు తీర్మానించుకున్నారు. గ్రామ సర్పంచ్ నిర్మల ఆధ్వర్యంలో మద్యపానం నిషేధించాలని, గ్రామంలో ఉండే బెల్టు షాపులు ఎత్తివేయాలని మహిళలు ఆందోళన చేశారు.

జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ ఏడుకొండలుకు వినతి పత్రం అందజేశారు. తమ ఊరిలో మద్యపానం బంద్​ చేయాలని, బెల్టు షాపులు ఎత్తివేయాలని కోరారు. మద్యం వల్ల ఊర్లో పరిస్థితి చాలా దయనీయంగా మారిందని మహిళలు ఎక్సైజ్ అధికారులతో వేడుకున్నారు. స్పందించి తక్షణమే మద్యాన్ని నిషేధించాలని మహిళలు అధికారులతో నివేదించుకున్నారు. ఎక్సైజ్ అధికారులు సానుకూలంగా స్పందించారు.

ఆ గ్రామంలో మద్యపానం నిషేధానికై మహిళలు తీర్మానించుకున్నారు

ఇదీ చూడండి : అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్​ రావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details