తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత: మర్రి - shadi mubarak

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ ఛైరపర్సన్​ పద్మావతితో కలిసి 209 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.

సంక్షేమం

By

Published : Sep 23, 2019, 8:15 PM IST

నిరుపేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్​ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ ఛైర్​పర్సన్ పద్మావతితో కలిసి 209 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి లబ్ధిదారులకు పట్టు చీర, పసుపు, కుంకుమ అందించారు. తెలంగాణలోని ప్రతి కుటుంబ సంక్షేమ బాధ్యత సీఎం కేసీఆర్​దేనన్నారు. ప్రజల కోసం అలుపెరగని కృషి చేస్తున్న మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. డిసెంబర్ 1న ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తామని తెలిపారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details