నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో పోలీసు అధికారి కావేటి శ్రీనివాసులు పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు సికింద్రాబాద్లోని మహంకాళి సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన పోలీస్ అధికారి
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో పోలీసు అధికారి కావేటి శ్రీనివాసులు తన సొంత గ్రామంలోని సుమారు 150 కుటుంబాలకు ఆరు లక్షల రూపాయలతో నిత్యావసరాలు అందజేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన పోలీస్ అధికారి
కరోనా లాక్డౌన్(Lock down) కారణంగా తన సొంత గ్రామానికి చెందిన పేదలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని… వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తన సొంత డబ్బులు ఆరు లక్షల రూపాయలతో సుమారు 150 కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. నిత్యం ప్రజా రక్షణలో ఉండే పోలీసు అధికారి తమకు సహాయం చేసినందుకు ప్రజలు అభినందించారు.
ఇదీ చూడండి:Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్డౌన్ పొడిగింపు