రైతుల న్యాయమైన కోరికలు తీర్చాలని మాజీ ఎంపీ మల్లురవి, ఆల్ ఇండియా కిసాన్ రైతు ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కుడికిళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల మాదిరి పాలమూరు రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులను ఉపయోగించుకొని సర్వే చేయడం సమంజసం కాదన్నారు. కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు వారు ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
రైతుల న్యాయమైన కోరికలు తీర్చాలి - mallu ravi
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల మాదిరి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న వారికి సరైన పరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
రైతుల న్యాయమైన కోరికలు తీర్చాలి