భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. రాత్రి నుంచి కురుస్తున్న వానతో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమలలోని నార్లాపూర్, ముక్కిడిగుండం గ్రామాల సమీపంలోని పెద్దవాగు, ఉడుముల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉడుముల వాగు చుట్టూ పొలాలు, గొర్రెల మందలు ఉండటం వల్ల రైతులు.. ప్రవాహాన్ని దాటలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
HEAVY RAINS IN NALLAMALA: నల్లమలలో పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు - The lakes and ponds are overflowing due to heavy rains
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని ఉడుముల వాగు, పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ రోడ్ల మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
![HEAVY RAINS IN NALLAMALA: నల్లమలలో పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు HEAVY RAINS IN NALLAMALA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12977634-265-12977634-1630848664882.jpg)
నల్లమలలో పొంగుతున్న వాగులు, వంకలు
వర్షాకాలం వస్తే ఆయా గ్రామాల నుంచి కొల్లాపూర్ వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉందని.. గ్రామస్థులు, రైతులు వాపోయారు. రెండు వాగులపై వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.
భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు
ఇదీ చదవండి:HYDERABAD RAIN EFFECT: రెండు రోజులుగా నీటిలోనే పలు కాలనీలు