తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతిచెందిదని.. బాధితుల ఆందోళన - నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ప్రసవ సమయంలో శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

The baby died due to the negligence of the doctors
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతిచెందిదని

By

Published : Jun 25, 2021, 3:03 PM IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ తండాకు చెందిన మల్లమ్మ అనే మహిళ గురువారం రాత్రి ప్రసవ నొప్పులతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షలు చేసి ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. ప్రసవ నొప్పులు అధికం కావడంతో... వైద్యులు ప్రసవం చేస్తుండగా శిశువు మృతి చెందింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో ఆస్పత్రికి చేరుకొని వైద్యులతో వాగ్వాదానికి దిగారు.

శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తండావాసులు ఆందోళనకు దిగారు. వారిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: వైఎస్​ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడు: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ABOUT THE AUTHOR

...view details